23 April 2007

శ్రీ సాయి లీలామృతము :: అధ్యాయము - 1 :: 01

ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ సాయి లీలామృతము
అధ్యాయము - 1
శ్రీ సాయి బాబా జీవితము
I



"మీరెవరు?" అని అడిగితే, "వటవృక్షము, మూలము, మూలానికి మూలము, మాది దత్తనగరము" అని చెప్పారు శ్రీ అక్కల్కోట స్వామి. ఆయనే ఒకసారి "అఖండ విశ్వమే మేము" అన్నారు. శ్రీ సాయి బాబా యొక్క మరొక రూపమే శ్రీ అక్కల్కోట స్వామి. వీరిద్దరి చరిత్రలూ దత్తావతారమనే బంగారు నాణానికి బొమ్మ-బొరుసు అనవచ్చు. వీరు ప్రపంచ చరిత్రలో అవతరించిన మహాత్ములందరిలో అగ్రగణ్యులు. ఈ విషయం శ్రీ మెహెర్ బాబా కూడా, శ్రీ సాయి ఈ విశ్వమంతటికీ గురువు అనదగిన వారని స్పష్టంగా చెప్పారు. ఆయన నివాసం వలన శిరిడీ వంటి మారుమూల కుగ్రామం కాశీ, తిరుపతి వంటి మహా క్షేత్రమైంది. అయితే ఈ క్షేత్రాలు ఒక మతం వారికి మాత్రమే పవిత్రమైతే, శిరిడీని మహాక్షేత్రంగా తలచేవారు ఎందరో అన్ని మతాలలోనూ ఉన్నారు. అక్కడ అనుభవమయ్యే శాంతి అనుభవించవలసిందే గాని మాటలలో చెప్పలేనిది. మనకు ఇంటివద్ద ఏమి చేసినా శాంతించని మనస్సు శిరిడీ లో కాలు పెట్టగానే ప్రాపంచిక వ్యవహారాలన్నింటినీ మరచి మహా శాంతిని పొందుతుంది. ఎక్కడ అలా శాంతి లభిస్తుందో అదే మన పరమ గమ్యమన్నది ఋషి వాక్యం.


శ్రీ సాయిబాబా శిరిడీ లో సుమారు 60 సంలు నివసించినప్పటికీ, ఆయన కీర్తి మధ్యాహ్న సూర్యుని శోభలాగా అన్ని దిక్కులా ఆ కాలంలోనే వ్యాపించినప్పటికీ, అసలు ఆయన పేరేమో, ఊరేమోఊరేమో, తల్లిదండ్రులెవరో, కులగోత్రాలేమిటో ఎవరికీ

No comments: