24 April 2007

శ్రీ సాయి లీలామృతము :: అధ్యాయము - 1 :: 02

తెలియలేదు. ఆయన దర్శనానికి నిత్యము ఎందరెందరో అన్నిప్రాంతాలనుండి వస్తుండేవారు. కాని వారిలో ఏ ఒక్కరూ ఆయన గురించి ఏమీ చెప్పలేక పోయారు. ఆయనతో చాలా కాలం ఉన్నవారు గూడా ఆయన గురించి ఏమీ చెప్పలేక పోయారు. ఆయనతో సన్నిహితంగా చాలా కాలం ఉన్నవారు గూడా ఆయన నుండి ఈ వివరాలు తెలుసుకోలేకపోయారు. దైవం వలనే నిజానికి ఆయన నామరహితుడు. ఇలానేదైవం యొక్క గుణాలన్నీ బాబాలో సంపూర్ణంగా కనిపిస్తాయి. శిరిడీ లో వెలసిన ఆ దేహమే తామన్న భ్రాంతి ఆయనకెన్నడూ లేదు. సర్వగతమైన చైతన్యమే ఆయన నిజతత్త్వమని భక్తులందరూ అనుభవపూర్వకంగా గుర్తిస్తూ వచ్చారు. ఆ దేహానికి కారణమైనవారే తమ తల్లిదండ్రులు అని, వారు ఆ దేహానికి పెట్టిన పేరే ఆయన పేరనీ ఆయన ఎలా తలుస్తారు?

ఈనాడు పెద్ద పెద్ద భవనాలతో, ఎన్నెన్నో దుకాణాలతో వజ్రాల ద్వీపం లా వెల్గొందుతున్న శిరిడీలో, రాజభవనం వంటి సమాధి మందిరంలో, సింహాసనం పై కూర్చున్న సామ్రాట్టులా శ్రీ సాయినాథుని మూర్తి శోభిస్తూ ఉంటుంది. . దేశం నలుమూలల నుండీ వారి దర్బారుకు చేరిన భక్తులెందరో తెచ్చిన లెక్కలేనన్ని మాలలతోను, క్రొత్త వస్త్రాలతో ప్రతి క్షణమూ సరిక్రొత్త అలంకరణలతో ఆయన వెలిగిపోతుంటారు. దీనికీ, నేటి శిరిడీ క్షేత్రానికీ ఎంతో చక్కని పోలిక ఉన్నది. కాని సుమారు నూటముప్పై సంల కిందట ఆ జిల్లాలోనే ఎక్కువ మందికి తెలియని చిన్న గ్రామాలలో ఒకటి ఆనాటి శిరిడి. అక్కడ 80 గడపలకు మించి వుండేవి కావు. దాదాపు ఇళ్ళన్నీ మట్టికట్టడాలే. ఒకటి రెండు గుడిసెలలో నిత్యావసర వస్తువులు అమ్మేవారు. గ్రామానికి అన్ని వైపులా తుమ్మ పొదలు, చిట్టడివి, పొలాలూ వుండేవి. అరుదుగా ఎప్పుడైనా ఆ ఊరిలోకి గుఋఋఅపు బండి వస్తే ఆ గ్రామంలోని పిల్లలు, పెద్దలు చోద్యంగా చూచేవారు. నిజానికి ఆ సమీపంలోని రహతా గ్రామానికి మాలపల్లె శిరిడీ. ఆ గ్రామంలో జరిగే గొప్ప వేడుక వారానికి ఒకసారి జరిగే సంత మాత్రమే. ఎప్పుడైనా కాలి నడకన దేశ సంచారము చేసే యాత్రికులు, సాధువులు, ఫకీర్లు ఆ గ్రామంలోని మారుతి ఆలయంలోనో, లేక "తాకియా" లోనో బస చేసేవారు. ఆనాటి శిరిడీ లో ఈనాటి మన జీవితాలలో లాగా సరియైన వీధి గాని, వీధి దీపాలు గాని వుండేవి గావు. గ్రామంలో తలుపులు గూడ లేని మారుతి, శని, గణపతి, మహాదేవుల ఆలయాలు వుండేవి. ఒకసారి ఒక పిచ్చివాడు ఆ మందిరంలో

No comments: