జొరబడి ఆ విగ్రహాలను విరగ్గొట్టాడు గూడ. వాటికి ఎలాంటి రక్షణ వుండేది గాదు. గ్రామ మధ్యంలో ఒక విఠలుడి ఆలయము, గ్రామ ప్రవేశంలో గ్రామ దేవత ఖండోబా ఆలయమూ వున్నాయి.
శ్రీ సాయి 1854 ప్రాంతం లో ఒక రోజు ఆ గ్రామానికి వుత్తరాన వున్న ఒక వేప చెట్టు క్రింద కూర్చొని కనిపించారు. నాడు ఆయనను చూచిన వృద్ధురాలు (నానా చోప్దార్ తల్లి) ఇలా చెప్పింది : "ఈ బాలుడు మొదట వేపచెట్టు క్రింద ఆసనం వేసుకొని కూర్చొని కనిపించాడు. అతడి రూపము మనోహరముగా వుండేది. ఎప్పుడూ ఎవరింటికీ వెళ్ళకుండా ఆ చెట్టూ నీడనే వుండేవాడు. పగలెవ్వరితోనూ కలిసేవాడు గాదు. రాత్రి సమయాలలో గూడా అతడు భయమెరుగడు. చూడడానికి చిన్నవాడే అయినా అతడి చర్యలు అతడు మహా జ్ఞానియని సూచించేవి. అంత చిన్న వయస్సులో చలికి, వేడికి చలించక తపస్సు చేసే అతడిని చూచి అందరూ ఆశ్చర్య పోయారు. అతడు వైరాగ్యమూర్తి. అతని స్థితి ఎవరికీ అంతు పట్టనిది. ఈ కుర్రవాడు అకస్మాత్తుగా ఎక్కడి నుండి వచ్చాడా ? అని అందరూ అనుకునేవారు. ఒక సారి గ్రామ దేవత ఖండోబా ఒకరికి పూనితే గ్రామస్తులందరూ అతనిని "ఇతనిని కన్న పుణ్యాత్ములెవ్వరు? ఇతడూ యెకడి నుండి వచ్చాడు?" అని అడిగారు. ఆ గణం వారి చేత ఒక గడ్డపార తెప్పించి, ఆ చెట్టుకింద ఒక చోట త్రవ్వించాడు. అక్కడ ఒక బండ, దాని క్రింద కొన్ని ఇటుకలూ కనిపించాయి. ఆ బండను తొలగిస్తే, దాని అడుగున భూగర్భము లోనికి దారి కనిపించింది. అందులో తిని వదిలేసిన పదార్థాలు, పూజా ద్రవ్యాలు, వెలుగుతున్న నాలుగు ప్రమిదలూ ఉన్నయి. అప్పుడు ఆ గణం, 'ఈ బాలుడిక్కడ 12 సంలు తపస్సు చేశాడు అని చెప్పాడు. అప్పటి నుండి ప్రజలు అనేక ప్రశ్నలతో ఆ బాలుణ్ణి విసిగించసాగారు. అతడు, అది గురుస్థానమని, ఆ బండని తిరిగి మూసివేయాలనీ చెప్పి అలానే చేయించాడు. తరువాత గూడ ఒక సారి ఆ వేపచెట్టు దగ్గరున్న భవనానికి మరమ్మత్తులు చేయిస్తుంటే, దాని క్రింద ఆ భూగృహము, సమాధి కనిపించాయి. వాటిని గురించి అడిగిన భక్తులతో గూడా బాబా అలానే చెప్పారు. తరువాత అక్కడ ఒకరోజున పిల్లలు ఆడుకొంటూ ఆ బండను తొలగించి చూచారు. అక్కడ భూమి లోకి మెట్లు, చాల పొడువుగాను, చీకటిగానూ ఉన్న గుహ కనిపించాయట. ఈ వివరాలు శ్రీ సాయి శరణానంద ఇలా వ్రాశారు:
No comments:
Post a Comment