26 April 2007

శ్రీ సాయి లీలామృతము :: అధ్యాయము - 1 :: 04

"ఒకప్పుడు బాబా మసీదులో ధుని దగ్గర వున్న స్తంభాన్ని నాకు చూపి, దాని క్రిందనే ఒక గుహ వున్నదని, తామందులో నివసించామనీ - ఎవరైనా మహాత్ములు వచ్చినప్పుడు తప్ప తామెప్పుడూ బయటకు వచ్చేవారు గారనీ, తమ గడ్డం పొడుగ్గా పెరిగి నేలను తాకేదనీ నాతో స్వయంగా చెప్పరు." బాబా మరొక్కప్పుడు సగుణమేరు నాయక్తో, "ఏమిటి, ఒకటి రెండు రోజుల ఉపవాసానికే తట్టుకోలేవా? నేను 12 సంలు కేవలం వేపాకు తిని జీవించాను" అన్న మాటలు ఈ వృత్తాంతాన్నే బలపరుస్తాయి. ఫిబ్రవరి 14, 1912 సాయి తాము చేసిన గురుసేవ గురించే కాబోలు, ఇలా చెప్పారు: "తామెన్నో కష్టాలకోర్చామని, నెలలల్ తరబడి ఆహారం లేకుండా వున్నామని, వేప మొన ఆకులు మాత్రమే తిన్నమనీ చెప్పారు. భగవంతుని కృప వలన ఆయన శరీరం శుష్కించి, ఎముకలు గూడ నిలువజాలని స్థితి లో వున్నప్పటికీ తమకు ప్రాణం పోలేదన్నారు" (ఖాపర్దే డైరీ)


II

ఈ బాలునికి 16 సంల లోపలే అంత గడ్డమెలా పెరిగింది? అసలు ఆయన వయస్సెంత? - ఒకప్పుడు ధూలియా కోర్టులో ఒక దొంగ, తన వద్ద పట్టుబడిన వస్తువులను తను దొంగిలించలేదని, తనకు సాయిబాబ యిచ్చారనీ చెప్పాడు. అంతట కోర్టువారు సాయిబాబాను కోర్టుకు హాజరు గమ్మని సమన్ లు జారీ చేశారు. బాబా ఎందరికో పూజ్యులవడం వలన, భక్తులు పెట్టుకున్న అర్జీననుసరించి ఆయన వద్దకే కోర్టు ప్రతినిధి వచ్చి విచారణ జరిపాడు. దానిలో ముఖ్యాంశాలివి:
న్యాయవాది : మీ పేరేమి?బాబా : వీరంతా నన్ను సాయిబాబా అంటారు."మీ తండ్రి పేరు?" -- "అదీ సాయిబాబాయే""మీ గురువు పేరు?" --"వెంకూసా""మతం?" -- "కబీరు""కులం?" --"దైవం""మీ వయస్సు?" --"లక్షల సంవత్సరాలు"

No comments: